న్యూఢిల్లీ: ఢిల్లీలో 18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా కరోనా టీకా వేయనున్నట్టు సిఎం కేజ్రీవాల్ తెలిపారు. 1.34 కోట్ల టీకాల కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. త్వరలోనే టీకాలు కొని…. ఢిల్లీ పౌరులకు వేస్తామని సిఎం పేర్కొన్నారు. ఢిల్లీలో 30.21 శాతం పాజిటివిటీ రేటు ఉందని చెప్పిన కేజ్రీవాల్ కరోనా ప్రాణాంతకం కాకుండా టీకాలు కాపాడతాయని తెలిపారు. 18ఏండ్లలోపువారికీ కరోనా సోకుతుంది, కొందరు కరోనాతో చనిపోతున్నారని ఆయన వెల్లడించారు. టీకాలు వారికి సురక్షితం అనుకుంటే 18ఏళ్లలోపువారికీ ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. చిన్నారుల కోసం కొత్త వ్యాక్సిన్లు అభివృద్ధి చేయాలన్నారు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు ప్రజలకు ఉచితంగా కరోనా టీకాలు వేయనున్నట్టు ప్రకటించాయి. అటు దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. రోజువారి పాజిటివ్ కేసులు మూడు లక్షలకు పైగా నమోదవుతున్నాయి.