Monday, January 20, 2025

రోడ్డు ప్రమాదంలో నలుగురు శివభక్తులు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో నలుగురు శివ మాల వేసుకున్న భక్తులు మృతి చెందిన సంఘటన ఢిల్లీలోని జిటి కర్నాల్ రోడ్డులోని సిరాస్‌పూర్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కన్వార్ యాత్రంలో భాగంగా శివ మాల వేసుకున్న భక్తులు ట్రక్కులో మోయిన్‌వాలి నుంచి హరిద్వార్ వెళ్తున్నారు. జిటి కర్నాల్ రోడ్డులో ఎదురుగా ట్రక్కు అదుపు తప్పి వీరి వాహనాన్ని ఢీకొట్టడంతో 16 మంది శివ భక్తులను సత్యవాడి రాజా హరిష్ చంద్ర ఆస్పత్రికి తరలించారు. మార్గం మధ్యలో నలుగురు చనిపోయినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మరో ఆస్పత్రికి తరలించారు. మరో ఐదుగురిని మాత్ర బాబు జగ్‌జీవన్ రామ్ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. ట్రక్ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి తప్పించుకున్నాడు. ట్రక్ డ్రైవర్‌పై ఐపిసి సెక్షన్ 279, 304ఎ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: పోలీస్‌నని బెదిరించి… యువతిపై అత్యాచారం?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News