Monday, December 23, 2024

సత్యేందర్ జైన్‌కు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) పెట్టిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు సత్యేందర్ జైన్, ఆయన ఇద్దరు సహాయకులకు ఢిల్లీ హైకోర్టు గురువారం బెయిల్ నిరాకరించింది. మార్చి 22న కోర్టు ఈ బెయిల్ వినతులపై తీర్పును రిజర్వులో ఉంచింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(పిఎంఎల్‌ఎ) కింద రెండు బెయిల్ షరతులు సంతృప్తికరంగా లేవు, సత్యేందర్ జైన్ చాలా ప్రభావమంత వ్యక్తి అని న్యాయమూర్తి దినేశ్ కుమార్ శర్మ అన్నారు.

‘లెక్కకు మించిన ఆస్తులపై సిబిఐ కేసు దాఖలు చేసింది. అయితే ఈ కోర్టు వ్యాలిడిటీ వివరాలలోకి వెళ్లదలచుకోలేదు. కొన్ని లెక్కకు మించిన ఆస్తులను కప్పి ఉంచారు(మాస్క్‌డ్). ఈ కేసును కోర్టు ప్రాథమికంగా చూడాల్సి ఉంది. అతనికి అనుబంధించిన కంపెనీలను అతనే నిర్వహిస్తున్నాడు. ప్రత్యేక జడ్జీ ఉత్తర్వులో ఎలాంటి చెడు తలంపు లేదు. ఉత్తర్వు సహేతుకమైనది’ అని జడ్జీ పేర్కొన్నారు.

సత్యేందర్ జైన్, ఆయన సహనిందితులు వైభవ్ జైన్, అంకుశ్ జైన్ గత ఏడాది మే 30 నుంచి కస్టడీలో ఉన్నారు. ట్రయల్ కోర్టు 2022 నవంబర్ 17న వారి బెయిల్ వినతిని కొట్టివేసింది. సత్యేందర్ జైన్ తన పిటిషన్ ద్వారా కేవలం ఎంట్రీల ఆధారంగా తనపై కేసు పెట్టారని వాదించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News