Wednesday, January 22, 2025

ఉద్ధవ్ థాక్రే వినతిని తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఎన్నికల సంఘం(ఈసి) శివసేన పార్టీ పేరు, దాని విల్లుబాణం గుర్తులను నిలిపివేస్తూ ఉత్తర్వు ఇచ్చిన దానికి వ్యతిరేకంగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పెట్టుకున్న వినతిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. తన ముందున్న సమస్యను ఎన్నికల సంఘం త్వరగా పరిష్కరించాలని జస్టిస్ సంజీవ్ నరులాతో కూడిన ఏకసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకుంటే సాధారణ ప్రజలతోపాటు, ప్రత్యర్థి శివసేన వర్గాలకు కూడా మేలు జరుగుతుందని పేర్కొంది. ఎన్నికల సంఘం పూర్తిగా వికృతమైనదని థాకరే కోర్టుకు విన్నవించుకున్న మరునాడే ఈ పరిణామం చోటుచేసుకుంది. థాక్రే వర్గం, షిండే వర్గం శివసేన పార్టీ పేరు, గుర్తు కోసం పేచీపడుతున్నాయన్నది తెలిసిన విషయమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News