Monday, December 23, 2024

మోడీపై అనుచిత వ్యాఖ్యల కేసులో శశిధరూర్ వాదనలకు తుది గడువు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలపై దాఖలైన వ్యాజ్యాన్ని కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు వినిపించడానికి ఢిల్లీ హైకోర్టు శశిథరూర్‌కు తుది అవకాశం మంజూరు చేసింది. ప్రధాని మోడీని లక్షంగా చేసుకుని “శివలింగంపై తేలు” అని కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ ఎద్దేవా చేశారు. దీనిపై బిజేపి నాయకుడు ఒకరు పరువునష్టం కేసు దాఖలు చేశారు. దీన్ని కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ సవాలు చేశారు. అయితే ఈ సవాలుపై వాదనలు వినిపించడానికి ఢిల్లీ హైకోర్టు తుది అవకాశం కల్పించింది. ఈ విచారణను 2024 మార్చి 15 కి వాయిదా వేసింది. శశిథరూర్ సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని కోరుతూ ఫిర్యాదిదారుడు రాజీవ్ బబ్బార్‌కు కోర్టు నోటీస్‌లు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News