Thursday, December 26, 2024

కవిత బెయిల్ పిటిషన్‌పై సిబిఐకి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో నిందితురాలు, భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) నాయకురాలు కె. కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు గురువారం సిబిఐకి నోటీసులు జారీ చేసింది.

అవినీతి కేసులో తనను సిబిఐ అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ బిఆర్‌ఎస్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్) కుమార్తె కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సిబిఐ సమాధానంను జస్టిస్ స్వర్ణ కాంత శర్మతో కూడిన ధర్మాసనం కోరింది.

మనీలాండరింగ్ కేసులో ఆమె బెయిల్ పిటిషన్‌తో పాటు,  మే 24న తదుపరి విచారణ చేపట్టనున్నారు.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) రెండూ విచారిస్తున్న కేసుల్లో తన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌లను మే 6న ప్రత్యేక కోర్టు తిరస్కరించడంతో కవిత హైకోర్టును ఆశ్రయించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News