Monday, December 23, 2024

కొవిడ్ బాధిత కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం : ఢిల్లీ హైకోర్టు ఆదేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కొవిడ్ మహమ్మారితో చనిపోయిన పోలీస్ కానిస్టేబుల్‌కు చెందిన కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం నాలుగు వారాల్లో అందజేయాలని ఆప్ ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశించింది. కానిస్టేబుల్ అమిత్‌కుమార్ కొవిడ్‌తో 2020లో మృతి చెందారు. దీనిపై ఢిల్లీ ప్రభుత్వం మృతుని భార్యకు, తండ్రికి నష్టపరిహారం మంజూరు చేస్తూ నవంబర్ 3న ఉత్తర్వు జారీ చేసింది. భార్యకు రూ. 60 లక్షలు, తండ్రికి రూ. 40 లక్షలు ఇవ్వడానికి 2020 మే 13న కేబినెట్‌లో నిర్ణయమైంది. అయినా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించక పోవడంతో మృతుని భార్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై కోర్టు నాలుగు వారాల్లో నష్టపరిహారం అందించాలని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News