Wednesday, January 22, 2025

జూన్ 9 వరకూ ఈడీ కస్టడీకి ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్

- Advertisement -
- Advertisement -

 

Satyendar Jain

న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్‌ను జూన్ 9 వరకూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కస్టడీకి అప్పగిస్తూ రౌస్ ఎవెన్యూ న్యాయస్థానం తీర్పు చెప్పంది. ఈడీ అధికారులు నిన్న ఆయన్ను అరెస్టు చేశారు. 2015-16 లో కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీ జరిపిన మనీలాండరింగ్‌ లావాదేవీలకు సంబంధించి ఆయనను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పలు బూటకపు (షెల్‌)  కంపెనీల నంచి సత్యేందర్‌ జైన్‌కు రూ.4.81 కోట్లు ముట్టినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం సత్యేందర్‌జైన్‌, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.4.81 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ ఆయనను అరెస్టు చేసింది.

కస్టడీ కాలంలో జైనుల ఆహారం కోసం ఢిల్లీ మంత్రి చేసిన అభ్యర్థనకు అనుమతి లభించింది. అయితే, ప్రతిరోజూ జైన దేవాలయాన్ని సందర్శించాలని ఆయన చేసిన మరో అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.  విచారణ సంస్థ తరఫున హాజరైన తుషార్ మెహతా… 2015-17 మధ్యకాలంలో సత్యేందర్ జైన్ రూ. 1.67 కోట్ల మేరకు అక్రమ ఆస్తులు సంపాదించారని పేర్కొన్నారు. ఆ డబ్బుతో భూమి కొనుగోలు చేశారని కూడా తెలిపారు.

ఇదిలావుండగా ఈరోజు తెల్లవారుజామున, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన కేబినెట్ లోని  మంత్రిపై పెట్టిన  కేసు “పూర్తిగా బూటకం, రాజకీయ ప్రేరేపితమైనది”  అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) “నిజాయితీ”గా వ్యవహరిస్తోందని, ఒకవేళ ఈ కేసులో ఒక్క శాతం మేర అయినా తప్పు ఉన్నట్టయితే  జైన్‌పై చర్యలు స్వయంగా తీసుకుని ఉండేవారమని కేజ్రీవాల్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News