- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో 5జీ నెట్ వర్క్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. పిటిషనర్ బాలీవుడ్ నటి జుహీచావ్లా సహా ముగ్గురికి రూ. 20 లక్షలు జరిమానా విధించింది. న్యాయ ప్రక్రియను జుహీచావ్లా అపహాస్యం చేశారని హైకోర్టు ఆరోపించింది. జుహీచావ్లా కోర్టు వాదనల లింగ్ ను సోషల్ మీడియాలో పోస్టు చేసి వాదనలకు మూడుసార్లు అంతరాయం కలిగించారని ధర్మాసనం తెలిపింది. అంతరాయం కలిగించినవారిని గుర్తించాలని ఢిల్లీ పోలీసులకు కోర్టు ఆదేశించింది. ప్రచారం కోసమే పిటిషన్ వేసినట్లుందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. 5జి సాంకేతిక పరిజ్ఞానం మానవులకు, జంతువులకు, ప్రతి రకమైన జీవులకు, వృక్షజాలానికి, జంతుజాలానికి ఎలా సురక్షితం అని ప్రజలకు ధృవీకరించాలని జుహీచావ్లా తన అభ్యర్ధనలో కోరారు.
Delhi High Court dismisses 5G wireless networks
- Advertisement -