Monday, December 23, 2024

శిశువు లింగాన్ని నిర్ధారించేది పురుషుడి క్రోమోజోమే..

- Advertisement -
- Advertisement -

ప్రజల్లో అవగాహన కల్పించాలని ఢిల్లీ హైకోర్టు సూచన

న్యూఢిల్లీ : వరకట్న మరణం కేసులో ఢిల్లీ హైకోర్టు గురువారం ఓ కీలక సూచన చేసింది. శిశువు లింగాన్ని నిర్ధారించేది పురుషుడి క్రోమోజోములే అని, దీనిపై సమాజంలో అవగాహన కల్పించాల్సి ఉందని కోర్టు తెలిపింది. కోడలు తమకు వంశోద్ధారకుడిని ఇవ్వలేదన్న కోపంతో దాడులు జరుగుతున్నాయని, ఈ విషయంలో తల్లిదండ్రులకు శాస్త్రీయ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. శిశువు లింగ నిర్ధారణ పురుషుడి క్రోమోజోమ్‌తో జరుగుతుందని, స్త్రీల క్రోమోజోమ్ వల్ల కాదని జస్టిస్ స్వర్ణకాంత్ తెలిపారు.

అడిగినంత కట్నం ఇవ్వక పోగా, ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చిందన్న కోపంతో ఓ కోడలిపై అత్తామామ వేధింపులు చివరకు ఆమె మరణానికి దారి తీసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన భర్త బెయిల్ కోసం దరఖాస్తు పెట్టుకోగా, భర్త వేధింపుల వల్లనే భార్య ఆత్మహత్య చేసుకుందని, అందుకే బెయిల్ ఇవ్వడం లేదని కోర్టు తెలియజేసింది. ఆడపిల్లలను కనే విషయంలో జన్యుశాస్త్రాన్ని విస్మరిస్తున్నారని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. మహిళల్లో ఎక్స్‌ఎక్స్, పురుషుల్లో ఎక్స్‌వై క్రోమోజోముల వల్లనే పిల్లల లింగ నిర్ధారణ జరుగుతుందని, జస్టిస్ స్వర్ణకాంత్ తెలిపారు. కొడుకు వల్లనే కూతురు పుట్టిందన్న విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలని , ఈ విషయంలో ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని శర్మ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News