Sunday, January 19, 2025

ఆప్ ఆఫీస్ స్థలంపై నిర్ణయం తీసుకోండి: కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ విషయంపై ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అన్ని రాజకీయ పార్టీలకు ఢిల్లీలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే అధికారం ఉంటుందని న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ తెలిపారు. స్థలం అందుబాటులో లేకపోవడం వల్ల కేటాయించలేక పోతున్నామని చెప్పడం కారణంగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది.

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందడంతో ఢిల్లీలో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి స్థలం కేటాయించాలని గతంలో కేంద్రాన్ని కోరింది. జూన్ 15 లోగా పార్టీ ప్రస్తుత కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సి ఉందని, వీలైనంత త్వరగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్(డీడీయూ మార్గ్) లోని మంత్రిత్వశాఖల వద్ద కొంత భాగాన్ని తాత్కాలికంగా కార్యాలయానికి కేటాయించాలని ఆప్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News