Friday, November 22, 2024

లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ సిఎం కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ట్రయల్‌కోర్టు విచారణపై స్టే విధించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కేజ్రీవాల్ పిటిషన్‌పై జస్టిస్ మనోజ్‌కుమార్ ఓహ్రీ నేతృత్వం లోని హైకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ట్రయల్ కోర్టు ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని పిటిషన్‌లో కోరారు. విచారణ చేపట్టిన కోర్టు ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించలేమని, ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 20 కి వాయిదా వేసింది. అయితే ఇదే మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌పై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై స్పందించాలని ఈడీని కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News