Wednesday, January 22, 2025

మహువా మొయిత్రాకు షాక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విదేశీమారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద తనపై దర్యాప్తునకు సంబంధించి మీడియాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నుంచి ‘రహస్య’ సమాచారం లీక్ కాకుండా చూడాలన్న తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేత మహువా మొయిత్రా అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం ప్రసాద్ తీర్పు వెలువరిస్తూ, ‘కొట్టివేయడమైంది’ అని తెలిపారు. ‘ప్రస్తుతం సాగుతున్న దర్యాప్తునకు సంబంధించి ప్రింట్/ ఎలక్ట్రానిక్ మీడియాకు ఎటువంటి రహస్య, సున్నిత, నిర్ధారితం కాని/

ధ్రువీకరణకాని సమాచారంతో సహా ఎటువంటి సమాచారాన్నీలీక్ చేయకుండా’ ఇడిని నిరోధించాలని హైకోర్టును మొయిత్రా అభ్యర్థించారు. ‘పిటిషనర్‌కు జారీ చేసిన ఫెమా సమన్ల కింద ప్రతివాది నంబర్ 1 (ఇడి) సాగిస్తున్న దర్యాప్తునకు సంబంధించి ఎటువంటి సమాచారాన్నీ లీక్ చేయకుండా, ప్రచురించకుండా/ ప్రసారం చేయకుండా’ పలు మీడియా సంస్థలను నిరోధించాలని కూడా హైకోర్టుకు ఆమె విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు మొయిత్రా తరఫున సీనియర్ న్యాయవాది కోర్టులో వాదిస్తూ, మొయిత్రాను ‘వేటాడుతున్నార’ని, ఫెడరల్ ఏజెన్సీ ఆమెకు సమన్లు జారీ చేసిన సమాచారాన్ని వాటిని ఆమె అందుకోవడానికి ముందే మీడియా ప్రచురించిందని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News