Saturday, November 16, 2024

28 వారాల గర్భ నియంత్రణకు ఢిల్లీ కోర్టు తిరస్కరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఓ వివాహిత తన 28 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు కోరగా ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు సోమవారం కొట్టివేసింది. 28 వారాల పిండంలో ఎలాంటి అసాధారణ లోపాలు లేనందున , ఈ భ్రూణ హత్యను అనుమతించలేమని , అందుకే ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు జస్టిస్ సుబ్రమనియం ప్రసాద్ తన ఆదేశాల్లో వివరించారు. పిండాన్ని తొలగించేందుకు చట్టబద్ధంగా 24 వారాల లోపే అనుమతి ఉంది. అందువల్ల ఆమె 28 వారాల పిండాన్ని తొలగించడానికి వైద్యులు నిరాకరించారు. దీంతో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటిపి) చట్టం ప్రకారం తన 28 వారాల గర్భాన్ని అబార్షన్ చేసుకోవడానికి అనుమతించాలని ఆ యువతి హైకోర్టును ఆశ్రయించింది.

ఆమె తరఫు న్యాయవాది అమిత్ మిశ్రా మాట్లాడుతూ గర్భం దాల్చిన విషయం ఆమెకు తెలియదని , జనవరి 25 న ఆమె 27 వారాల గర్భవతి అని తెలిసిందని చెప్పారు. ఈ విషయం ఆమె కుటుంబం లో ఎవరికీ తెలియనందున దీన్ని పరిగణించాలని కోరారు. అయితే మహిళ మానసిక , శారీరక , స్థితితోపాటు పిండం ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ని వైద్య పరీక్షలకు ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. దీనిపై కోర్టు ఆదేశాలు వెలువడనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News