Wednesday, January 22, 2025

కొవిడ్ వ్యాక్సిన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

Delhi High Court reprimands Baba Ramdev

బాబా రామ్‌దేవ్‌కు ఢిల్లీ హైకోర్టు మందలింపు

న్యూఢిల్లీ : కొవిడ్ 19 వ్యాక్సిన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ను ఢిల్లీ హైకోర్టు గట్టిగా మందలించింది. అల్లోపతి ఔషధాలు, చికిత్సలపై దేశ ప్రజలను తప్పుతోవ పట్టించవద్దని స్పష్టం చేసింది. కొవిడ్ 19 బూస్టర్ డోస్ సామర్ధం, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టీకా తీసుకున్నా కరోనా బారిన పడిన అంశంపై మాట్లాడటం పై ఆందోళన వ్యక్తం చేసింది. రామ్‌దేవ్ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, కరోనిల్ కొవిడ్‌పై పనిచేయదంటూ పలు వైద్యుల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా రామ్‌దేవ్ బాబాకు ధర్మాసనం చురకలు అంటించింది. “ ఇక్కడ వ్యక్తుల పేర్లు ఉపయోగిస్తున్నారు. అది విదేశాలతో మన దేశ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచ నేతల పేర్లను సూచించడం వల్ల వారితో మన సంబంధాలు దెబ్బతింటాయి. మీ ప్రకటన అల్లోపతి ఔషధాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంది. మీరు ఏది చెప్పినా నమ్మే అనుచరులను కలిగి ఉండటాన్ని స్వాగతిస్తున్నాం. కానీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. ” అని జస్టిస్ అనుప్ జైరాం భంభాని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News