Friday, September 20, 2024

సిబిఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్

- Advertisement -
- Advertisement -

ఆరోపిత ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తన తీర్పును సోమవారం రిజర్వ్ చేసింది. ఆప్ నేత, సిబిఐ తరఫున న్యాయవాదులు చేసిన వాదనలు విన్న అనంతరం జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ తీర్పును రిజర్వ్ చేశారు. ఈ కేసులో కేజ్రీవాల్ బెయిల్ అభ్యర్థనను సిబిఐ వ్యతిరేకించింది. ఎక్సైజ్ కుంభకోణంలో ఆయన ‘సూత్రధారి’ అని,

విడుదల చేసినట్లయితే ఆయన సాక్షులను ప్రభావితం చేయవచ్చునని సిబిఐ వాదించింది. ‘ఆయన అరెస్టు జరగకపోయి ఉంటే దర్యాప్తు పూర్తి అయి ఉండేది కాదు. ఒక నెలలోపే మేము చార్జిషీట్ దాఖలు చేశాం’ అని సిబిఐ న్యాయవాది డిపి సింగ్ తెలిపారు. అంతకుముందు కేజ్రీపైన, ఆప్ ఎంఎల్‌ఎ దుర్గేశ్ పాఠక్ సహా మరి ఐడుగురిపై సిబిఐ విచారణ కోర్టులో తమ తుది చార్జిషీట్ దాఖలు చేసింది. కేజ్రీ అరెస్టు జైలులో నుంచి బయటకు రాకుండా చూసేందుకు జరిపిన ‘బీమా అరెస్టు’ అని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News