- Advertisement -
ఢిల్లీ: ఆక్సిజన్ కొరత విషయంలో కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ సరఫరాకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఢిల్లీకి కేటాయించిన 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఎప్పుడు అందుతుందని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఢిల్లీలో ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేసుకోవాలని కేజ్రీవాల్ ప్రభుత్వానికి సూచించింది. జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో 20 మంది కరోనా రోగులు మృతి చెందిన విషయం తెలిసిందే.
- Advertisement -