Friday, November 15, 2024

సిఎంకు ప్రత్యేక హక్కుల్లేవ్.. కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రికో న్యాయం..సామాన్యుడికో న్యాయం ఉండదు 
విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పాల్సిన అవసరం లేదు 
నిందితుడి వీలును బట్టి విచారణ సాగదు 
ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం 
కేజ్రీవాల్ అరెస్టు చట్టబద్ధమే సబబే..రిమాండ్‌ను అక్రమంగా పరిగణించలేం 
ఇడి వద్ద తగిన ఆధారాలున్నాయని స్పష్టం చేసిన జడ్జి.. సుప్రీంను ఆశ్రయించనున్న ఆప్

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు అయింది. లిక్కర్ కుంభకోణంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. కేజ్రీవాల్ అరెస్టులో చట్ట నిబంధనల ఉల్లంఘన ఏమీ జరగలేదని కోర్టు స్పష్టం చేసింది.

ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కే జ్రీవాల్ తన అరెస్టుతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కస్టడీకి తనను రిమాండ్ చేయడాన్ని కూడా సవాల్ చేశారు. ఇడి కస్టడీకి పంపడం అక్రమం ఏమీ కాదని కోర్టు తెలిపింది. కేజ్రీవాల్ అరెస్టుకు కారణమైన ‘తగినన్ని దాఖలాలు’ ఇడి వద్ద ఉన్నాయని, సహేతుకమైన ఉత్తర్వు ద్వారా ఇడి కస్టడీకి ట్రయల్ కోర్టు ఆయనను రిమాండ్ చేసిందని హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ తెలియజేశారు. ‘అర్వింద్ కేజ్రీవాల్ అరెస్టు చట్ట నిబంధనలకు విరుద్ధంగా జరగలేదని కోర్టు భావిస్తున్నది. రిమాండ్‌ను అక్రమంగా పరిగణించలేం’ అని జస్టిస్ స్వరాన కాంతశర్మ తీర్పు వెలువరిస్తూ చెప్పారు.

ఆమె 25 నిమిషాల సేపు తీర్పు చదివారు. తన నిర్ణయానికి సంబంధించిన కొన్ని అంశాలను కూడా ఆమె హిందీలో వివరించా రు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సిఎం హోదాలో ఉన్న కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలన్న ఆయన తరుపు లాయర్ విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. సిఎంకు ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయం ఉండదని స్పష్టం చేశారు. సిఎం అయినంత మాత్రాన ప్రత్యేక హ క్కులేమీ ఉండవని తెలియజేశారు. విచారణ ఎలా సాగా లో నిందితుడు చెప్పాల్సిన అవసరం లేదు. నిందితుడి వీలును బట్టి విచారణ సాగదని పేర్కొన్నారు. కేజ్రీవాల్ బెయిల్ అభ్యర్థనపై తాను విచారణ జరపడం లేదని, కానీ కొన్ని కారణాలపై అరెస్టును సవాల్ చేస్తున్న ఆయన రిట్ పిటిషన్‌ను విచారిస్తున్నానని కోర్టు స్పష్టం చేసింది. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందని, కోర్టులు పట్టించుకునేది రాజ్యాంగపరమైన నైతికత గురించే గాని, రాజకీయ నైతికత గురించి కాదని కోర్టు నొక్కిచెప్పింది.

తమ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి అవరోధం సృష్టించడానికే తనను అరెస్టు చేశారనికేజ్రీవాల్, ఆయన పార్టీ ఆప్ ఆరోపించడాన్ని దృష్టిలో పెట్టుకుని కోర్టు ఈ వ్యాఖ్య చేసింది. ‘రాజకీయ భావనలు, సమీకరణాలను న్యాయస్థానం ముందుకు తీసుకురాజాలరని, చట్టపరమైన విచారణలకు అవి సంబంధించినవి కావని ఈ కోర్టు అభిప్రాయపడింది. ఈ కోర్టు ముందు ఉన్న వ్యవహారం కేంద్ర ప్రభుత్వం, పిటిషనర్ కేజ్రీవాల్ మధ్య సంఘర్షణ కాదని ఈ కేసులో స్పష్టం చేయడం ప్రధానం. ఇది కేజ్రీవాల్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మధ్య కేసు’ అని జస్టిస్ శర్మ వివరించారు. ఈ దశలో తాము మినీ విచారణ నిర్వహించజాలం కనుక ఆప్ జాతీయ కన్వీనర్‌కు వ్యతిరేకంగా అప్రూవర్ల ప్రకటనలపై విచారణ సమయంలో తేల్చగలమని కోర్టు తెలిపింది. విచారణ దశలో అప్రూవర్లను క్రాస్ పరీక్ష చేసే స్వేచ్ఛ కేజ్రీవాల్‌కు ఉందని కోర్టు తెలిపింది. 2021-22 సంవత్సరానికి ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ విధానం రూపకల్పన, అమలులో అవినీతి, మనీ లాండరింగ్ జరిగాయన్న ఆరోపణకు సంబంధించినది ఈ కేసు.

ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆ విధానాన్ని ఢిల్లీ ప్రభుత్వం ఆ తరువాత రద్దు చేసింది. ఫెడరల్ మనీ లాండరింగ్ నిరోధక సంస్థ నిర్బంధ చర్య తీసుకోకుండా కేజ్రీవాల్‌కు రక్ష ణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించిన కొన్ని గంటల తరువాత ఆయనను మార్చి 21న ఇడి అరెస్టు చేసింది. ఇడి కస్టడీ గడువు ముగిసిన తరువాత విచారణ కోర్టులో ఆయనను ఈ నెల 1న హాజరు పరచినప్పుడు ఆయనను జ్యుడీషియల్ కోర్టుకు రిమాండ్ చేశారు. ఆప్ జాతీయ కన్వీనర్ తన అరెస్టు ‘సమయాన్ని’ హైకోర్టు ముందు ప్ర శ్నించారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలు, సమానావకాశాల కల్పనతో సహా రాజ్యాంగం మౌలిక స్వరూపానికి విరుద్ధంగా అది జరిగిందని ఆయన వాదించారు. ఆయన అభ్యర్థనను ఇడి వ్యతిరేకించింది. రానున్న ఎన్నికల కారణంగా అరెస్టు నుంచి ‘రక్షణ’ కేజ్రీవాల్ కోరుకోజాలరని, చట్టం ఆయనకు, ‘ఆమ్ ఆద్మీ’కి సమానంగా వర్తిస్తుందని ఇడి వాదించింది. ఇది ఇలా ఉండగా, కేజ్రీ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతోఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ఆప్ వర్గాలు మంగళవారం వెల్లడించాయి.

ఐదు అంశాలపై కోర్టు కీలక వ్యాఖ్యలు

నేరంలో ప్రమేయం
కేజ్రీవాల్ అటు ఢిల్లీ సిఎంగా, ఆప్ కన్వీనర్‌గానూ లి క్కర్ స్కామ్‌లో చురుకుగా పాల్గొన్నా రు.. ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ఆయనదే కీలక పాత్ర.. ఆయ నే స్వయంగా ముడుపులు డిమాండ్ చేసినట్లు ఇడి సమర్పించిన పత్రాల ద్వారా స్పష్టమవుతున్నది..
అప్రూవర్ల స్టేట్‌మెంట్…
అప్రూవర్లుగా మారిన మాగుంట రాఘవ, శరత్ రెడ్డి స్టేట్‌మెంట్‌లను పిఎంఎల్‌ఎ, సిఆర్‌పిసిలోని 164వ సెక్షన్ కింద రికార్డు చేశారు. అందువల్ల అప్రూవర్ల స్టేట్‌మెంట్‌లపై అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదు. అప్రూవర్లకు సంబంధించిన చట్టం వందేళ్ల నుంచి అమలులో ఉన్నది. కేజ్రీవాల్ కోసం ఈ చట్టా న్ని తీసుకొని రాలేదు.. కేజ్రీవాల్ అరెస్టుకు కావలసిన స్పష్టమైన ఆధారాలు ఇడి వద్ద ఉన్నాయి.
అరెస్టు సమయం…
ఎన్నికల వేళ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం ఆయన ను, ఆయన పార్టీని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికేనన్న వాదన సరైంది కాదు. ఆధారాలున్నప్పుడు సమయం ప్రధానం కానేకాదు.
ఎన్నికల బాండ్లు
అప్రూవర్లలో ఒకరు ఎన్నికల బాండ్ల రూపంలో బిజెపికి విరాళాలు అందించారు. మరొకరు… బిజెపి మిత్రపక్షంలో చేరారు అని ఆప్ చేసిన ఆరోపణలు కోర్టు విచారణ పరిధిలో లేవు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరు టిక్కెట్లు ఇచ్చారు. ఎవరు ఎన్నికల బాం డ్లు కొనుగోలు చేశారన్నది కోర్టుకు అప్రస్తుతం.
ప్రత్యేక హక్కులు
ఢిల్లీ సిఎంను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలన్న విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నాం. నిందితుడిని ఎలా విచారించాలనేది కోర్టు పరిధిలోని అంశం. అది నిం దితుడి అభీష్టం మేరకు ఉండదు. సిఎంలకో చట్టం.. సామాన్యులకో చట్టం ఉండదు. ముఖ్యమంత్రి అయినంత మాత్రానా ప్రత్యేక హక్కులేమీ ఉండవు. రా జ్యాంగ నిబద్ధతతే మాకు ప్రామాణికం తప్ప రాజకీయ నైతికత కాదు…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News