Wednesday, November 6, 2024

దేశ ప్రతిష్టను దెబ్బతీశారు.. బిబిసిపై దావా

- Advertisement -
- Advertisement -

బిబిసిపై దావా.. హైకోర్టు సమన్లు

న్యూఢిల్లీ : ప్రధాని మోడీపై వివాదాస్పద డాక్యుమెంటరీకి సంబంధించి ఢిల్లీ హైకోర్టు సోమవారం బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బిబిసి)కు నోటీసులు వెలువరించింది. భారత ప్రధానిని కించపరిచే విధంగా ఉన్న ఈ డాక్యుమెంటరీతో దేశ ప్రతిష్ట దెబ్బతింటుందని పేర్కొంటూ స్వచ్ఛంద సేవా సంస్థ, గుజరాత్‌కు చెందిన జస్టిస్ ఫర్ ట్రయల్ బిబిసిపై పరువు నష్టం దావాకు దిగింది. కేవలం ప్రధాని నరేంద్ర మోడీనే కాకుండా, దేశ ప్రతిష్టను, న్యాయవ్యవస్థను అగౌరవపర్చే విధంగా ఈ డాక్యుమెంటరీని రూపొందించారని సంస్థ పేర్కొంది.

దీనిపై స్పందించిన న్యాయమూర్తి సచిన్ దత్తా ఈ దావా విషయంలో బిబిసి ఇండియాకు నోటీసులు వెలువరించింది. సమాధానం ఇచ్చుకోవాలని ఆదేశించింది.లండన్ , భారత్ బిబిసిల నుంచి వివాదాస్పదమైన ఇండియా ః ది మోడీ క్వశ్చన్ అనే రెండు భాగాల డాక్యుమెంటరీని రూపొందించి విడుదల చేశారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. భారతీయ వ్యవస్థలను అప్రతిష్ట పాలు చేసే విధంగా డాక్యుమెంటరీ ఉందని స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే న్యాయస్థానానికి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News