- Advertisement -
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన నాయకుడు రాహుల్ రమేష్ షావలె దాఖలు చేసిన పరువునష్టం దావాకు సంబంధించి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య థాక్రేలకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం సమన్లు జారీచేసింది. ఇదే కేసుకు సంబంధించి శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌కు కూడా హైకోర్టు సమన్లు జారీచేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 17వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
- Advertisement -