Monday, November 18, 2024

మీ పవర్ సంగతి సోమవారం తేలుస్తాం: హైకోర్టు

- Advertisement -
- Advertisement -

ఓ వైపు ఢిల్లీ మున్సిపల్ సూళ్ల విద్యార్థులకు పుస్తకాల సమస్య ఉంది. మరో వైపు మీరు జైలులో ఉండి అధికారం చలాయిస్తామంటున్నారు. ఈ విధంగా అయితే తీవ్ర సమస్యలకు పరిష్కారం దక్కేది ఎప్పుడు అని ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్‌ను, ఆప్ ప్రభుత్వాన్ని నిలదీసింది. వేలాదిగా పిల్లలు ఎంసిడి స్కూళ్లలో చదువుకుంటున్నారు. వీరికి పుస్తకాల సరఫరా నిర్ణయం సిఎం నుంచి కొన్ని అనుమతుల తరువాతనే వీలవుతుందని విద్యాశాఖాధికారులు కోర్టుకు తెలిపారు. అయితే కేజ్రీవాల్ మద్యం స్కామ్ కేసులో ఇప్పుడు తీహార్ జైలులో ఉన్నారు. ఇప్పటివరకూ జైలులో నుంచి కేజ్రీవాల్ పాలన సాగించే విషయంలో తాము మర్యాదపూర్వకంగానే ఏదైనా జాతీయ ప్రయోజనాలు, జనం సమస్యలు కీలకమని చెపుతున్నామని,

అయితే ఇప్పుడు విద్యార్థుల పుస్తకాల విషయం తమ ముందుకు వచ్చినందున ఇక తాము ఈ విషయంలో ఏదో ఒకటి తేల్చాల్సి ఉందని, దీనిపై సోమవారం తమ నిర్ణయం ప్రకటిస్తామని , తగు ఆదేశాలు వెలువరిస్తామని యాక్టింగ్ చీఫ్ జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ పిఎస్ అరోరాతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ దశలో ఢిల్లీ ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ఉద్ధేశించి ‘ మీ క్లయింట్‌కు కేవలం అధికారం చలాయింపుపైనే దృష్టి ఉన్నట్లుంది’ అని వ్యాఖ్యానించింది. ఒక్కరి పవర్ కోసం వేలాది మందిని గాలికి వదిలిపెడుతారా? మీరు ఇంకా ఎంతగా అధికారం అనుభవించాలనుకుంటున్నారు? అని ప్రశ్నించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News