Wednesday, January 22, 2025

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ

- Advertisement -
- Advertisement -

స్విస్ ఐక్యూ ఎయిర్ నివేదిక విడుదల

న్యూఢిల్లీ : ప్రపంచం లోని అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీతోపాటు కోల్‌కతా, ముంబై నగరాలు టాప్ 5 లో ఉన్నాయి. ఈమేరకు స్విస్ ఐక్యూ ఎయిర్ నివేదికను విడుదల చేసింది. ఆదివారం ఉదయం 7.30 గంటలకు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 483 గా ఉంది. దీంతో ఐక్యూ ఎయిర్ జాబితాలో ఢిల్లీ మొదటిస్థానంలో ఉంది. ఇక 371 పాయింట్లతో పాకిస్థాన్ లోని లాహోర్ రెండో స్థానంలో ఉండగా, కోల్‌కతా(206). బంగ్లాదేశ్ రాజధాని ఢాకా (189), పాకిస్థాన్ లోని కరాచీ (162), తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఇక 162 పాయింట్లతో ముంబై ఆరోస్థానంలో ఉండగా, చైనా లోని షెన్యాంగ్ (159). హాంగ్జౌ (159), కువైట్ సిటీ (155), చైనాలోని వుహాన్ (152), టాప్ టెన్‌లో నిలిచాయి. ఢిల్లీ లోని కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత ఏక్యూ 550 కి చేరుకోవడంతో 2 కోట్ల మంది ప్రజలు కంటి, గొంతు సమస్యలతో బాధపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News