- Advertisement -
న్యూఢిల్లీ : ఢిల్లీ సాకేత్ ఫ్యామిలీ కోర్టు జడ్జి కొవాయి వేణుగోపాల్ (47) గత వారం రోజులుగా కరోనాతో బాధపడుతూ సోమవారం ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందారు. ఆదివారం ఆయన ఆస్పత్రిలో చేరారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతూ ఉదయం 11 గంటలకు మృతి చెందారని లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ నిర్లక్షం వల్లనే ఆయన మృతి చెందారని సాకేత్ బార్ అసోసియేషన్ కార్యదర్శి ధిర్‌సింగ్ కసానా ఆరోపించారు. అందరు జడ్జిలకు, న్యాయవాదులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
- Advertisement -