న్యూఢిల్లీ : రూ. 2.44 కోట్ల ప్రభుత్వ నిధులను మోసగించిన కేసులో 10 మంది ఢిల్లీ పోలీస్ అధికారులపై విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా అనుమతించారు. ఈమేరకు రాజ్ నివాస్ ఆదివారం ఈ విషయాన్ని ప్రకటించింది. ఢిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విచారణ విభాగం ఇద్దరు మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు హెడ్ కానిస్టేబుల్స్, ఐదుగురు కానిస్టేబుల్స్‌పై మోసగించడం, కుట్ర, విశ్వాస ఉల్లంఘన తదితర అభియోగాలపై 2019 అక్టోబర్ 1న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. నిందితుల్లో సబ్ ఇన్‌స్పెక్టర్ మీనా కుమారి, హెడ్‌కానిస్టేబుల్ విజేందర్‌సింగ్, కానిస్టేబుల్స్ క్రిషన్‌కుమార్, అనిల్‌కుమార్ తాము నిధులను స్వాహా చేసినట్టు ఒప్పుకున్నారని హోమ్ డిపార్టుమెంట్ వెల్లడించింది. ఈ మేరకు వారి ప్రకటనలను సమర్పించింది. కానిస్టేబుల్స్ క్రిషన్‌కుమార్, విజేందర్‌సింగ్, అనిల్‌కుమార్, మీనా కుమారిలను ఇప్పటికే సర్వీస్ నుంచి తొలగించడమైంది.
నిధుల మోసం కేసులో 10 మంది పోలీస్ అధికారులపై విచారణ
- Advertisement -
- Advertisement -
- Advertisement -