Monday, December 23, 2024

డిజెబి అధికారులపై ఎఫ్‌ఐఆర్‌కు ఢిల్లీ ఎల్‌జి ఆదేశం

- Advertisement -
- Advertisement -

Delhi LG orders FIR against DJB officials

న్యూఢిల్లీ: మంచినీటి బిల్లులలో రూ.20 కోట్లు స్వాహా చేశారన్న ఆరోపణలపై ఢిల్లీ జల్ బోర్డు(డిజెబి), ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు, ఒక ప్రైవేట్ కంపెనీ అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా ఆదేశించారు. కాగా.. ఈ చర్యను డిజెబి వైస్ చైర్మన్, సీనియర్ ఆప్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ స్వాగతించారు. అప్పటి డిజెబి చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ ఈ వ్యవహారాన్ని ఈ వ్యవహారాన్ని తన దృష్టికి తీసుకువచ్చిన తర్వాత దీనిపై దర్యాప్తునకు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా సిఫార్సు చేశారని ఆయన తెలిపారు. ఇటువంటి దర్యాప్తులన్నిటినీ తాము స్వాగతిస్తామని శనివారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆయన తెలిపారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన యూనియన్ బ్యాంకు అధికారులతోపాటు కొందరు డిజెబి అధికారులపై ఆరోపణలు వచ్చాయని భరద్వాజ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News