Monday, December 23, 2024

ఢిల్లీ మొహల్లా క్లినిక్స్‌లో అవకతవకలపై సిబిఐ దర్యాప్తుకు ఎల్‌జి ఆదేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొహల్లా క్లినిక్‌లలో అవకతవకలపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా సిబిఐని లెఫ్టెనెంట్ గవర్నర్ వికె సక్స్సేనా ఆదేశించినట్లు రాజ్‌నివాస్ వర్గాలు గురువారం తెలిపాయి. ఆస్పత్రుల్లోని పరీక్షా కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రులకు నాసిరకం మందులు సప్లై చేసినట్లు వచ్చిన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తుకు సక్సేనా ఆదేశించిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. మొహల్లా క్లినిక్‌లలో తప్పులు చేసినందుకు ఆప్ ప్రభుత్వం గత ఏడాది పలువురు డాక్టర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకుందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ గతంలో చెప్తూ, ఆరోగ్య శాఖ కార్యదర్శిని పదవినుంచి తొలగించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించేందుకు ఆప్ ప్రభుత్వం మొహల్లా క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ క్లినిక్‌లలో రోగులు లేకపోయినప్పటికీ రేడియాలజీ, పాథాలజీ పరీక్షలు నిర్వహించినట్లు నకిటీ పత్రాలను సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో లెఫ్టెనెంట్ గవర్నర్ వికె సక్సేనా ఈ ఫిర్యాదులపై దర్యాప్తు జరపాల్సిందిగా సిబిఐని కోరినట్లు తెలుస్తోంది. కొందరు డాక్టర్లు ఆలస్యంగా ఆస్పత్రులకు వెళుతూ వైద్య సేవలు అందించడంలో నిర్లక్షం వహిస్తున్నారని తెలుస్తోంది. మరికొందరు డాక్టర్లు అసలు క్లినిక్‌లకు రాకుండానే వచ్చినట్లు తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నట్లు కూడా ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్, ఆరోగ్య విభాగాలు జరిపిన దర్యాప్తులో తేలింది.ఈ నిర్లక్షంపై గతంలోనూ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఏడుగురు డాక్టర్లపై వేటు పడింది.ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఆరోగ్య వాఖ కార్యదర్శినితొలగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News