- Advertisement -
న్యూఢిల్లీ : 2021-22 మద్యం విధానాన్ని అమలు చేయడంలో విఫలమైన అధికారులపై ఢిల్లీ లెఫ్టినెనంట్ గవర్నర్ వీకే సక్సేనా చర్యలు తీసుకున్నారు. 11 మంది అధికారులపై ఆయన సస్పెన్షన్ విధించారు. దీంట్లో ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ అరవ్ గోపీ కృష్ణ, డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ ఆనంద్ కుమార్ తివారీలు ఉన్నారు. నూతన మద్యం విధానాన్ని అమలు చేయడంలో తీవ్రంగా విఫలమైనట్టు ఆరోపణలు ఉన్నాయి. వీరితో పాటు ముగ్గురు అడ్‌హాక్ అధికారులు, ఆరుగురు ఢిల్లీ ఎక్సైజ్ అధికారులపై సస్పెన్షన్ విధించారు. టెంటర్లను ఖరారు చేయడంలో , సంబంధిత వెంటర్లకు టెంటర్ బెనిఫిట్లు చేరవేయడంలో విఫలమైన అధికారులపై వేటు వేసినట్టు గవర్నర్ కార్యాలయం పేర్కొంది. డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సక్సేనా ఈ చర్యలు తీసుకున్నారు.
- Advertisement -