న్యూదిల్లీ: భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్, దాని అనుబంధ సంస్థ TML CV మొబిలిటీ సొల్యూషన్స్ లిమిటెడ్ ద్వారా దిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (DTC)కి 400 అత్యాధునిక స్టార్‌బస్ EV బస్సులను సరఫరా చేసింది. 12 సంవత్సరాల కాలానికి 1,500 లో-ఫ్లోర్, ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయ డానికి, నిర్వహించడానికి, ఆపరేట్ చేయడానికి DTC నుండి పొందిన పెద్ద ఆర్డర్ ఇది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాలకు అనుగుణంగా, ఈ జీరో-ఎమిషన్ బస్సులు దేశీయంగా నెక్స్ట్-జెన్ ఆర్కిటెక్చర్‌పై నిర్మించబడ్డాయి, తాజా ఫీచర్లతో, అధునాతన బ్యాటరీ వ్యవస్థల ద్వారా శక్తిని పొందుతాయి. దిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం అంతటా సురక్షితమైన, సౌకర్యవంతమైన, సౌలభ్యవంతమైన ఇంట్రా-సిటీ ప్రయాణాన్ని అందించడానికి ఇవి రూపొందించ బడ్డాయి. ఈ విస్తరణతో టాటా మోటార్స్ దేశవ్యాప్తంగా 1,000కు పైగా ఇ-బస్సులను సరఫరా చేసే ముఖ్యమైన మైలురాయిని సాధించింది.
400 ఈ-బస్సుల సముదాయాన్ని 5 సెప్టెంబర్ 2023న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా దిల్లీ న్యాయ, రెవెన్యూ, రవాణా, మహిళలు, శిశు అభివృద్ధి శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పాలనాసంస్కరణల శాఖ మంత్రి కైలాష్ గహ్లోట్, దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్, IAS, దిల్లీ కమీషనర్-కమ్-ప్రిన్సిపల్ సెక్రటరీ (రవాణా) ఆశిష్ కుంద్రా, DTC మేనేజింగ్ డైరెక్టర్ శిల్పా షిండే, IASతో సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు
జీరో-ఎమిషన్, సైలెంట్ ఎలక్ట్రిక్ బస్సుల సముదాయాన్ని స్వాగతిస్తూ DTC మేనేజింగ్ డైరెక్టర్ శిల్పా షిండే, IAS, మాట్లాడుతూ.. “DTC దిల్లీ పౌరులకు సమర్థవంతమైన, ఆర్థిక, విశ్వసనీయమైన రోడ్డు రవాణా సేవలను అందించడానికి కట్టుబడి ఉంది. ఈ 400 ఎలక్ట్రిక్ బస్సుల జోడింపు జాతీయ రాజధాని భూభాగం అంతటా మాస్ మొబిలిటీని సురక్షితమైందిగా, తెలివైందిగా, కాలుష్యరహితంగా మారుస్తుంది. ప్రయాణీకులకు మరింత యాక్సెస్, మరింత సౌకర్యం, ఎక్కువ సౌలభ్యాన్ని అందించడంతో పా టు, ఈ నెక్స్ట్-జెన్ బస్సులు నగర వాయు నాణ్యతను మెరుగుపరచడానికి మా సమిష్టి ప్రయత్నాలలో కూడా దోహదపడ తాయి’’ అని అన్నారు.
ఈ సందర్భంగా TML CV మొబిలిటీ సొల్యూషన్స్ లిమిటెడ్ చైర్మన్ అసిమ్ కుమార్ ముఖోపాధ్యాయ మాట్లాడుతూ, “మాస్ మొబిలిటీని కాలుష్యరహితం, శబ్దరహితం, ఉద్గార రహితంగా చేయడానికి డీటీసీతో దాని దూరదృష్టి, ప్రగతిశీల విధానంలో భాగస్వామ్యం కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ 400 ఇ-బస్సుల చేర్పు అనేది డీటీసీతో మా దశాబ్దపు సంబంధాన్ని మరింతగా పెంచుతుంది. మేము ఇ-బస్ ఫ్లీట్‌ను ఛార్జ్ చేయడానికి, నిర్వహించడానికి, సజావుగా ఆపరేట్ చేయడానికి జాతీయ రాజధాని దిల్లీలోని ఎంపిక చేసిన డిపోలలో అత్యాధునిక ఎనేబుల్ ఎకోసిస్టమ్‌లను ఏర్పాటు చేశాం. దిల్లీలో ప్రజా రవాణాను పరిశుభ్రంగా, స్థిరంగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా, సౌలభ్యవంతంగా, ఇంధన సమర్ధవంతంగా మార్చాలనే ఆకాంక్షను నెరవేర్చేందుకు దశల వారీగా డీటీసీకి మరో 1100 ఈ-బస్సులను సరఫరా చేయడం ద్వారా డీటీసీతో మా అనుబంధాన్ని బలోపేతం చేయడానికి మేము ఎదురుచూస్తున్నాం’’ అని అన్నారు.
టాటా స్టార్‌బస్ EV, పట్టణ నగర ప్రయాణానికి కొత్త ప్రమాణాలను నిర్దేశించే అత్యాధునిక ఇ-బస్సు. దాని పూర్తి-ఎలక్ట్రిక్ డ్రైవ్ ట్రెయిన్‌తో, ఈ అత్యాధునిక వాహనం శక్తి వినియోగాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది, ఫలితంగా తక్కువ శక్తి వినియోగం, కార్యాచరణ ఖర్చులు ఉంటాయి. ఇది సున్నా ఉద్గారాలను నిర్ధారిస్తూ బోర్డింగ్ సౌలభ్యం, సౌకర్యవంతమైన సీటింగ్, డ్రైవర్-స్నేహపూర్వక కార్యకలాపాల వంటి లక్షణాలను అందిస్తుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్, ఎయిర్ సస్పెన్షన్, ఇంటెలిజెంట్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ (ITS), ఇతర అధునాతన ఫీచర్‌లతో, పానిక్ బటన్‌తో కూడిన ఇది తన ప్రయాణికులకు సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బస్సు స్వచ్ఛమైన ప్రజా రవాణాకు నిబద్ధతను కలిగి ఉంటుంది. పట్టణ ప్రయాణీకుల రవాణా అవసరాలకు ఆదర్శవంతమైన ఎంపిక.