Wednesday, January 22, 2025

నా ఫోన్లు అన్ని ఇచ్చేస్తున్నా: కవిత

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఎంఎల్‌సి కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విచారణ నిమిత్తం మూడోసారి ఇడి ఆఫీస్‌కు చేరుకున్నారు. తనపై ఇడి తప్పుడు ప్రచారం చేస్తుందని ఎంఎల్‌సి కవిత మండిపడ్డారు. ఇడి ఆఫీస్‌కు వెళ్లే ముందు కవిత మీడియాతో మాట్లాడారు. గతంలో తాను ఉపయోగించిన ప్రతి ఫోన్‌ను ఇడి అధికారులు ఇస్తున్నానని పేర్కొన్నారు. ఇడి విచారణకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. మహిళ గోప్యతకు భంగం కలిగించేలా ఫోన్లు అడిగారని, అయినా కూడా తన ఫోన్లు ఇచ్చేస్తున్నానని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా సోమవారం కవితను పదిన్నర గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 10.30 నుంచి రాత్రి 9.14 గంటల వరకు కవితను ఇడి అధికారులు విచారించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News