Monday, December 23, 2024

లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సిఎం

- Advertisement -
- Advertisement -

హై-దరాబాద్: ఢిల్లీ లిక్కర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు కు సంబంధించి తాజాగా ఇడి దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్ లో పలువురి పేర్లను ప్ర స్తావించింది. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, వైసిపి ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తదితరుల ప్రమేయం గురించి ప్రస్తావించింది. ఇక నిందితుల జాబితాలో మా త్రం 17 మంది పేర్లను పేర్కొంది. ఇందులో అ భిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, సమీర్ మ హేంద్రు, శరత్ చంద్రా, విజయ్ నాయర్, బినోయ్ బాబుతో పాటు పలువురి పేర్లను వెల్లడించింది. ఇడి దాఖలు చేసిన ఈ సప్లిమెంటరీ చార్జ్ షీట్ ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది. ఈ కేసులోని నిందితులకు నోటీసులు కూడా జారీ చేసింది. లిక్కర్ కేసుకు సంబంధించి జనవరి 6 న13,657 పేజీల అనుబంధ ఛార్జిషీట్‌ను ఇ డి దాఖలు చేసింది. ఇందులో ఐదుగురి పేర్లతో పాటు ఏడు కంపెనీలను చేర్చింది.

విజయ్‌నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, అమిత్ అరోరాలను నిందితులు గా చేర్చింది. మనీలాండరింగ్‌కు సంబంధించి మొత్తం 12 మంది పేర్లను సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో ఇడి పేర్కొంది. తీహార్ జైల్లో ఉన్న సమీర్ మహేంద్రు, శరత్‌రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయ ర్, బినోయ్ బాబు, అమిత్ అరోరా, ఇటీవల అ ప్రూవర్‌గా మారిన దినేష్ అరోరాతో పాటు ముం దస్తు బెయిల్ తీసుకున్న ఇద్దరు మాజీ అధికారులు కుల్దీప్‌సింగ్, నరేంద్రసింగ్, ముత్తా గౌత మ్, అరుణ్ పిళ్లై, సమీర్ మహేంద్ర కంపెనీలను ఛార్జిషీట్‌లో ప్రస్తావించింది. మొత్తం ఛార్జిషీట్‌పై 428 పేజీలతో ఇడి ఫిర్యాదు నివేదికను కోర్టుకు అందించింది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మొ త్తం 65 మందిని విచారించి స్టేట్ మెంట్స్ రికార్డు చేసినట్లు ఇడి పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన వివరాలను కూడా ఛార్జీషీట్‌లో ఇడి క్లుప్తం గా తెలిపింది. ఇందులో కమిటీలలోని వ్యక్తుల పేర్లతో పాటు కంపెనీల వివరాలను కూడా వివరించింది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేరును కూడా ఇడి ప్రస్తావించింది. ఎక్సైజ్ పాల సీ రూపొందించే సమయంలో అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన విజయ్ నాయర్‌తో మాట్లాడినట్లు ఇడి చార్జిషీట్‌లో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను మొత్తం నడిపించింది విజయ్ నాయర్ అని ఇడి పేర్కొంది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సెక్రటరీ అరవింద్ పేరు కూడా ఇడి ఛార్జ్‌షీట్‌లో ఉంది. కీలక నిందితుడు విజయ్ నాయర్ కేజ్రీవాల్ క్యాంపు ఆఫీసు నుండి కార్యకలాపాలు కొనసాగించారని ఇడి వెల్లడించింది. సౌత్ గ్రూపు నుంచి 100 కోట్లు ముడుపులు విజయ్ నాయర్ అందుకున్నారని, సౌత్ గ్రూపునకు, ఆప్ లీడర్లకు మధ్య ఒప్పందంలో భాగంగానే ఈ ముడుపులు అందుకున్నారని ఇడి రాసుకొచ్చింది. సౌత్ గ్రూపులో శరత్ చంద్రారెడ్డి, వైసిపి ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ తదితరులు సభ్యులుగా ఉన్నారు. సౌత్ గ్రూపు తరపున అభిషేక్ బోయిన్ పల్లి, రామచంద్రన్ పిళ్ళై, బుచ్చిబాబు ప్రతినిధులుగా వ్యవహరించినట్లు ప్రస్తావించింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి గతేడాది ఆగస్టులో సిబిఐ కేసు నమోదు చేసినట్లు ఇడి పేర్కొంది. గతేడాది నవంబరులో సిబిఐ తొలి ఛార్జీషీట్‌ను ఫైల్ చేసింది.ఇందులో ఆరుగురిని నిందితులు గా పేర్కొంది. విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లితో పాటు పలువురి పేర్లు ఇందులో ఉన్నాయి. మనీలాండరింగ్ అంశాల కోణంలో గతేడాది ఆగస్టులోనే కేసు న మోదు చేశామని ఇడి వెల్లడించింది.. సమీర్ మహేంద్రు మనీలాండరింగ్ వ్యవహారంలో దాఖలు చేసిన తొలి ఛార్జిషీట్ పై ఫిబ్రవరి 23న విచారణ జరగనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఈడీ చార్జీషీట్ కల్పితం: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఇడి దాఖలు చేసిన రెండో చార్జీషీట్ పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీ లి క్కర్‌స్కాంపై గురువారం ఇడి అధికారులు రెండో చార్జీ షీ ట్ దాఖలు చేశారు. ఈ చార్జీషీట్ పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరుల పేర్లు కూడా ఇడి అధికారులు. ఈ చార్జీషీట్ పూర్తి కల్పితమైందన్నారు. ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఇడిని కేంద్రం ఉపయోగించుకుంటుందని ఆయన ఆరోపించారు. తన ప్రభుత్వాన్ని అస్థిపర్చేందుకు ఇడిని కేంద్రం ఉపయోగిస్తుందని ఆయన ఆరోపించారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను విపక్ష పా ర్టీలను ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం ఉపయోగిస్తుంద ని ఆయన ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇడి దాఖ లు చేసిన చార్జీషీట్లలో ఎంత మందికి శిక్ష లు పడ్డాయో చెప్పాలన్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాం నిధులను గోవా ఎన్నికల్లో ఆప్ ఉపయోగించిందని ఇడి తన చార్జీషీట్‌లో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News