Thursday, December 26, 2024

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి కవిత.. ఆమెతో పాటు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆమె బయలుదేరారు. ఆమెతో పాటు మంత్రి కెటిఆర్, ఎంపి సంతోష్‌లు కూడా ఉన్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఈనెల 20న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీకి వెళ్లారు. కాగా, ఈడీ నోటీసులు జారీ చేయడంపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 24వ తేదీన విచారించనున్నట్లు సుప్రీం తెలిపింది.

ఒక మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని కానీ అలా చేయలేదని కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో పిటీషన్ పెండింగ్‌లో ఉండటంతో ఈనెల 16వ తేదీన ఈడీ విచారణకు కవిత హాజరు కాలేదు. దీంతో సుప్రీం తీర్పునకు ముందే మరోసారి వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంతో రేపు(సోమవారం) ఈడీ ఎదుట విచారణ నిమిత్తం హాజరుకావడానికి కవిత ఢిల్లీకి వెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News