Sunday, January 19, 2025

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో  హైదరాబాద్ సహా 30చోట్ల ఈడి సోదాలు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్/ఢిల్లీ: మద్యం కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) విచారణ మొదలెట్టింది. హైదరాబాద్ సహా దేశంలోని ఆరు రాష్ట్రాల్లో 30కి పైగా ప్రాంతాల్లో ఈడి అధికారులు మంగళవారం సోదాలు మొదలెట్టారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరుఉ, గురుగ్రామ్, లక్నో తదితర నగరాల్లో తనిఖీలు చేయడం ప్రారంభించారు. హైదరాబాద్‌లో ప్రేమ్‌సాగర్, అభిశేఖ్ రావు, సృజన్ రెడ్డి ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ కుంభకోణంలో సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, దాని ఆధారంగా ఈడి మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

ఢిల్లీ మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరగడంతో పాటు విధానపరమైన లోపాలున్నట్లు ఢిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు. టెండర్ల విధానంలో కొందరికి ఆయాచిత లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా, కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ)కు సిఫార్సు చేశారు. దాంతో సిబిఐ కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగింది. ఈ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సహా మొత్తం 15 మంది వ్యక్తులు, ఓ కంపెనీ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News