Monday, December 23, 2024

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్‌ను ఇడి అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అభిషేక్, విజయ్ సిబిఐ అదుపులో ఉన్నారు. కోర్టు ఉత్తర్వుల సమయంలో ఇద్దరిని ఇడి అదుపులోకి తీసుకుంది. బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు ఇడి కస్టడీలో ఉన్నారు. శరత్, బినోయ్ సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. దర్యాప్తులో భాగంగా కస్టడీకి ఇవ్వాలని కోర్టులో ఇడి పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై మధ్యాహ్నం ఇరువురి వాదనలను ప్రత్యేక కోర్టు విననుంది. దినేస్ అరోరా చెప్పిన వివరాల ప్రకారం సిబిఐ ప్రత్యేక కోర్టు వాంగ్మూలం నమోదు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో దినేస్ అరోరా అప్రూవర్‌గా మారారు. సిబిఐ ప్రత్యేక కోర్టు వాంగ్మూలమంతా వీడియో రికార్డు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News