Thursday, January 23, 2025

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక అంశాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నా యి. సిబిఐ దాఖలు చేసిన 10 వేల పేజీలున్న చార్జిషీట్‌లో లిక్కర్ స్కాం తదితర అం శాలను బయటపెట్టింది. సిబిఐ ఆరోపించిన అభియోగాలను కోర్టు ఆమోదిం చింది. ముడుపులు నగదు రూపంలో హవాలా మార్గం లో తరలించినట్లు గుర్తించింది. అభిషేక్ బోయిన్‌పల్లి 20 నుం చి 30 కోట్ల రూపాయల నగదును హవాలా మార్గం లో తరలించినట్లు ఛార్జిషీటులో సిబిఐ వెల్లడించింది . ఆ డబ్బంతా అడ్వాన్స్ గా 2021 జులై, సెప్టెం బర్ మధ్య కాలంలో ముట్టజెప్పినట్లుగా పేర్కొం ది. రూ.30 కోట్లను దినేష్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు అందజేసినట్లు తెలిపింది. దక్షిణాది ప్రాం తానికి చెందిన మద్యం ఉత్పత్తిదారుల తరపున అభిషేక్ బోయిన్‌పల్లి వ్యవహారం నడిపినట్లు తెలిపింది.

శరత్ చం ద్రారెడ్డి, మాగుం ట శ్రీనువాసులు రెడ్డి తదితరులు సౌత్ గ్రూప్‌ను కంట్రోల్ చేశారని అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఇడి పేర్కొం ది. సిబిఐ దాఖలు చేసిన తొలి ఛార్జిషీటును ఆమోదిం చి నిందితులకు సిబిఐ కోర్టు సమన్లు జారీ చేస్తూ ఇచ్చి న ఉత్తర్వుల్లో కీలక అం శాలను ప్రస్తావించింది. మద్యం ఉత్ప త్తిదారులు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు ఏ ఇద్దరి మధ్య ఎక్క డా గుత్తాధిపత్యం కానీ సమూహాలకు కానీ లబ్ధిచేకూర్చకూడదనే విధానాన్ని రూపకల్పన చేసినట్లుగా తెలిపింది. మద్యం పాలసీ రూపకూల్పన జరుగుతున్న సమయంలోనే నిందితులు కుట్రకు పాల్ప డినట్లు తేటతెల్లం చేసింది. 2021 జులై, సెప్టెంబర్ మధ్య లో రూ.30 కోట్లను అభిషేక్ బోయిన్‌పల్లి, దినేష్ అరోరాకు అందజేశారని తెలిపింది. మొత్తం నగదును విజయ్ నాయర్‌కు అందజేసినట్లుగా స్ప ష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వ ముఖ్యులను ప్రభావితం చేసేందుకు హోల్‌సేల్ దారులకు 12 శాతం లాభాలు ఆర్జించేలా అందులో తిరిగి 6 శాతం అభిషేక్ బోయిన్‌పల్లికి తిరిగి వచ్చేలా కుట్ర చేశారని పేర్కొం ది.

హోల్‌సేల్ వ్యాపారం లో వచ్చే లాభాల్లో రామచం ద్రన్ పిళ్లై నుం చి బ్యాం క్ అకౌం ట్స్ ద్వా రా ముత్తా గౌతమ్‌కు రూ.4,756 కోట్లు అందాయయని, అతని అకౌంట్ నుం చి అభిషేక్ బోయిన్‌పల్లికి రూ.3.85 కోట్లు ట్రాన్స్ ఫర్ అయినట్లుగా తెలిపింది. మొత్తం ఏడుగురు నిందితులు నేరపూరిత కుట్రకు పాల్ప డ్డారని పేర్కొం ది. కొందరు ప్రజా సేవకులు, ఇతర సం స్థలతో కలిసి ఈ అక్రమాలకు పాల్ప డ్డారని వెల్లడిం చింది. అడ్వాన్స్ కింద ముడుపులు, కిక్ బ్యా క్స్ అందాయని సిబిఐ తెలిపింది. చట్ట విరుద్ధ లక్ష్యాలను సాధించేందుకు కుట్రకు సంబంధించిన అంశాలను ఛార్జిషీటులో పొందుపరిచింది. సముచితమైన మౌఖిక, డాక్యుమెం టరీ ఆధారాలను కూడా దర్యా ప్తులో భాగం గా దర్యా ప్తు సం స్థలు సేకరిం చాయని సిబిఐ ప్రత్యే క కోర్టు అభిప్రాయపడింది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వారిపైనా, పేర్లు లేని వారిపైనా కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు సిబిఐ ఛార్జిషీట్‌లో వెల్లడించింది. సిబిఐ ఛార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోనికి తీసుకోవడంతో విచారణ ప్రారంభం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News