Monday, December 23, 2024

ఢిల్లీ లిక్కర్ స్కామ్: సమీర్ మహేంద్రు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Delhi liquor scam: Sameer Mahendru arrested

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఇండిస్పిరిట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, వ్యాపారవేత్త సమీర్ మహేంద్రుడిని ఇడి అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఎక్సైజ్‌ పాలసీని రూపొందించి అమలు చేయడంలో వ్యాపారి మహేంద్రుడు అక్రమాలకు పాల్పడ్డారని సిబిఐ అధికారులు ఆరోపించారు. అంతకుముందు, ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విజయ్ నాయర్‌ను సిబిఐ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. సెప్టెంబర్ 7వ తేదీన దేశవ్యాప్తంగా 35 చోట్ల ఈడీ దాడులు నిర్వహించి, మహేంద్రుని జోర్ బాగ్ నివాసంలో కూడా సోదాలు నిర్వహించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News