Monday, December 23, 2024

ప్రియురాలిని చంపి… 12 కిలో మీటర్ల దూరంలో పడేశారు….

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ప్రియురాలు పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ప్రియుడు తన చెల్లితో కలిసి చంపేసి అనంతరం 12 కిలో మీటర్ల దూరంలో మృతదేహం పడేసిన సంఘటన ఢిల్లీలోని తెలివార ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉత్తరాఖండ్ రాష్ట్రం మిర్జాపూర్ చెందిన నాజ్ అలియాస్ మహి(25) ఢిల్లీలో నివాసం ఉంటుంది. నాలుగు సంవత్సరాల క్రితం వినీత్, నాజ్ ఇంట్లో నుంచి పారిపోయి ఢిల్లీలో సహజీవనం చేస్తున్నారు. 2017లో బఘ్‌పాట్‌లోని రామ్‌లాల్ సుగర్ మిల్‌లో వినీత్, అతడి తండ్రి వినయ్ పవర్ ఓ మర్డర్ కేసులో జైలుకు వెళ్లారు. 2019లో వారు జైలు నుంచి బయటకు విడుదలయ్యారు. వినీత్ జైలులో ఉన్నప్పుడు అతడి చెల్లి పరుల్‌తో నాజ్ కలిసి ఉంది. 2022లో వినీత్ జైలు నుంచి విడుదలైన తరువాత నాజ్ కలుసుకుంది.

Also Read: పెళ్లి మండపంలో వధువు, వరుడిపై యాసిడ్ దాడి…. పది మందికి గాయాలు

తనని పెళ్లి చేసుకోవాలని వినీత్‌ను నాజ్ కోరింది. ఇద్దరు కులాలు వేరు కావడంతో వినీత్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. వినీత్ ఆమెను హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. తనని పెళ్లి చేసుకోవాలని వినీత్‌పై నాజ్ ఒత్తిడి తీసుకరావడంతో ఆమెను గొంతునులిమి చంపేసి అనంతరం మృతదేహాన్ని రూమ్‌లో దాచిపెట్టాడు. తన సహచరుడికి వినీత్ పోన్ చేసి బైక్ తీసుకరావాలని సూచించాడు. మృతదేహానికి పరుల్  స్కార్ఫ్ చుట్టి మూటకట్టింది. వినీత్ సహచరుడు బైక్ నడిపిస్తుండగా మృతదేహాన్ని మధ్యలో పెట్టుకొని 12 కిలో మీటర్లు ప్రయాణించిన అనంతరం కరవాల్ నగర్‌లో మృతదేహాన్ని పడేశారు. బఘ్‌పట్‌లోని తన గ్రామాన్ని వదిలిపెట్టి వినీత్ పారిపోయాడు. తెలివారా ప్రాంతంలో పరుల్ అద్దె ఇల్లు కోసం వెతుకుతోంది. స్థానికులకు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని నాజ్‌గా గుర్తించారు. వెంటనే స్థానిక సిసి కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. వినీత్‌తో పాటు అతడి సహచరుడు, చెల్లిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News