Tuesday, December 24, 2024

కావాలనే కేజ్రీవాల్ లో కేలరీ డైట్ తీసుకుంటున్నారు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తీహార్ జైలులో జుడిషియల్ కస్టడీలో ఉన్న ఢిలీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డాక్టర్లు సూచించిన మెడికల్ డైట్‌ను, మందులను ఉద్దేశపూర్వకంగా తీసుకోవడం లేదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా ఆరోపించారు. కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై జైలు సూపరింటెండెంట్ అందచేసిన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్‌కు రాసిన ఒక లేఖలో సక్సేనా ఉటంకిస్తూ ఇంటి నుంచి సమృద్ధిగా భోజనం వస్తున్నప్పటికీ కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా తక్కువ కేలరీలను తీసుకుంటున్నట్లు అనేక ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయని ఆరోపించారు.

ఈ లేఖపై ఆప్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదని రాజ్ నివాస్ వర్గాలు తెలిపాయి. టెప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న కేజ్రీవాల్ డాక్టర్లు సూచించిన మేరకు ఆహారాన్ని, మందులను, ఇన్సులిన్‌ను తీసుకునేలా సూచించాలని ప్రధాన కార్యదర్శిని సక్సేనా కోరారు.

జూన్ 6 నుంచి జులై 1 మధ్య ప్రతి రోజు మూడుపూటలా అందచేసే ఆహారాన్ని, మందులను కేజ్రీవాల్ పూర్తిగా తీసుకోలేదని డైట్ మానిటరింగ్ చార్ట్ సూచిస్తోందని ఆయన తెలిపారు. జూన్ 2న జైలుకు వచ్చిన రోజున కేజ్రీవాల్ బరువు 63.5 కిలోలు ఉండగా ఇప్పుడు 61.5 కిలోలు ఉందని, తక్కువ కేలరీలు తీసుకోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. జూన్ 18న కేజ్రీవాల్ ఇన్సులిన్ తీసుకోలేదని ఆయన తెఇపారు. గ్లూకోమీటర్ రీడింగ్‌లో కూడా చాలా తేడాలు కనిపిస్తున్నాయని, జూన్ 19న లంచ్‌కు ముందు కేజ్రీవాల్ గ్లూకోమీటర్ రీడింగ్ 104ఎంజిఎల్ ఉండగా లంచ్‌కు ముందు చేసిన సిజిఎంఎస్ రీడింగ్ 82 ఎంజిఎల్ చూపిస్తోందని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News