Monday, December 23, 2024

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ చురకలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఓ ఘాటైన లేఖ పంపించారు. బడ్జెట్‌ను ఎందుకు నిలిపివేశారని ఈ లేఖలో ప్రశ్నించారు. ప్రజలకు ప్రజాధనం వినియోగం ఏ విధంగా జరిగిందనేది తెలుసుకునే హక్కు ఉంది. బడ్జెట్ సమర్పణ ఎందుకు ఆపారని సందేహం వ్యక్తం చేశారు. ఆప్ ప్రభుత్వంతో లెఫ్టినెంట్ గవర్నర్‌కు సాగుతోన్న వివాదాలలో ఇది మరో సరికొత్త పరిణామం అయింది. ఎటువంటి సరైన కారణం లేకుండా బడ్జెట్‌ను నిలిపివేయడం దేనికి? ఇది ప్రజలను అవమానించడమే కదా? అని ఆప్ ప్రభుత్వంపై ఎల్‌జి విరుచుకుపడ్డారు.

ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిషి వద్ద కాగ్ రిపోర్టు గత ఏడాది ఆగస్టు నుంచి పెండింగ్‌లో పడి ఉంది. దీనికి ఎప్పుడు వెలుగు? అని ఒక్కరోజు క్రితమే లెఫ్టినెంట్ గవర్నర్ సిఎంను నిలదీశారు. ఈ నెల 15వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌ను మార్చి మొదటివారం వరకూ పొడిగించారు. అయితే బడ్జెట్ సమర్పణలో కొంత జాప్యం జరుగుతుందని అతిషి సభలోనే ప్రకటించారు. దీనిపై కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో లెఫ్టినెంట్ గవర్నర్ స్పందించారు. ఇప్పటికే వార్షిక ఆర్థిక వ్యయ ఆదాయ పత్రం ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉంది. దీనికి ముందు కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా వచ్చింది.అయితే సభలో ప్రవేశపెట్టాల్సిన దీనిని ముందుగా ఇంతవరకూ తనకు ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. నిర్థిష్ట నిబంధనల మేరకు బడ్జెట్‌ను ముందుగా తనకు తెలియచేయాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News