Monday, December 23, 2024

ఢిల్లీలో మొరిగే కుక్కకు బెదిరిన మనిషి ఏం చేశాడంటే…

- Advertisement -
- Advertisement -

Man hit dog with rod

న్యూఢిల్లీ: ఢిల్లీలోని పశ్చిమ్‌ విహార్‌లో ఓ వ్యక్తి తన పొరుగింటి కుక్క మొరుగుతుండడంతో  ఇనుప రాడ్‌తో దాడికి దిగాడు.  కుక్క అతడిని కూడా కరిచినట్లు పోలీసులు తెలిపారు. అతడు చిర్రెత్తి ముగ్గురిని గాయపరిచాడు.  ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆ ప్రాంతంలో అమర్చిన సిసిటివి కెమెరాలో రికార్డ్ అయింది.

ధరమ్‌వీర్ దహియా ఈరోజు తెల్లవారుజామున షికారు చేస్తున్న సమయంలో అతని పొరుగున ఉన్న రక్షిత్ కు చెందిన  కుక్క అతనిపై మొరగడం ప్రారంభించింది. కుక్క మొరగడంతో ఆగ్రహించిన ధరమ్‌వీర్ దహియా కుక్కను తన తోక పట్టుకుని దూరంగా నెట్టాడు.

కుక్క యజమాని తన పెంపుడు జంతువును రక్షించడానికి వచ్చినప్పుడు,  దహియా కుక్కను కొట్టాడు, అది అతనిని కరిచింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. దహియా రాడ్‌తో రక్షిత్ ,అతని కుటుంబానికి చెందిన ఒక మహిళను కొట్టాడు. అప్పుడు  జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన తన ఇతర పొరుగువాడైన 53 ఏళ్ల వ్యక్తిపై కూడా దాడి చేశాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో… కోపోద్రిక్తుడైన వ్యక్తి,  తన ఇంట్లోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళను రాడ్‌తో కొట్టినట్లు చూపిస్తుంది. మరొక వీడియోలో రాడ్‌తో కుక్క తలపై కొట్టినట్లు కనబడుతోంది.గాయపడిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించామని, కాగా కుక్కకాటుకు గురై దహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. కుక్క తలపై రాడ్‌తో కొట్టడంతో గడ్డ కట్టిందని, దానిని పశువైద్యుని వద్దకు తీసుకువెళతామని దాని యజమాని రక్షిత్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News