Sunday, April 6, 2025

సిగరేట్ ఇవ్వలేదని పొడిచారు…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సిగరేట్ ఇవ్వలేదని ఓ యువకుడిని ఇద్దరు యువకులు పొడిచిన సంఘటన ఈశాన్య ఢిల్లీలోని నంద్ నగ్రి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నంద్ నగ్రిలోని ఇ బ్లాక్‌లో ఫహిమ్ అనే యువకుడి దగ్గరకు చేతన్, రవి వచ్చి సిగరేట్ కావాలని అడిగారు. పహిమ్ సిగరేట్ ఇవ్వకపోవడంతో ఇద్దరు అతడితో గొడవకు దిగారు. అనంతరం కత్తి తీసుకొని ఫహిమ్‌ను పొడిచి పారిపోయారు. రక్తపు మడుగులో ఉన్న ఫహిమ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ఫహిమ్‌ను నుంచి వివరాలు సేకరించారు. గతంలో ఫహిమ్‌కు ఇద్దరు యువకులకు మధ్య చిన్న గొడవలు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు.

Also Read: ఘనంగా పెళ్లి…. మూడు ముళ్లు వేస్తుండగా వరుడు అరెస్ట్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News