Monday, December 23, 2024

ఢిల్లీలో దారుణం.. పట్టపగలే యువతిపై కత్తితో దాడి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో పట్టపగలే దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ యువతిపై అమన్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఢిల్లీ ముఖర్జీ నగర్ లోని నార్త్ క్యాంపస్ సమీపంలో హడ్సన్ లేన్ లో శుక్రవారం జరిగిన ఈ సంఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనను దుర్భాషలాడిందనే ఆగ్రహంతో 22 ఏళ్ల అమన్ రోడ్డుపై పండ్లు విక్రయిస్తున్న ఓ తోపుడు బండిలో ఉన్న కత్తిని తీసుకుని, యువతిపై దాడికి పాల్పడ్డాడు. అదే దారిలో వెళ్తున్న కొందరు అమన్ ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే వారిని తప్పించుకుని అమన్ పారిపోయాడు. గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. కత్తిపోట్లు లోతుగా తగలకపోవడంతో ఆ యువతి బతికి బయటపడిందని పోలీసులు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News