Monday, December 23, 2024

కుంపటి పక్కన నిద్రించిన వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లోని అంగన్‌వాడీ వలీ ప్రాంతంలో బౌనర్స్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి రాత్రివేళ చలికి తట్టుకోలోక బొగ్గుల కుంపటి పక్కనే నిద్రపోయి మంటల కారణంగా మృతి చెందాడు. ఈ సంఘటన న్యూ మంగళపురిలో జరిగింది. ప్రమాదవశాత్తు బొగ్గులు ఎక్కువగా మండడంతో పక్కనే ఉన్న అతడి దుస్తులకు మంటలు అంటుకోవడంతో చనిపోయాడు. పోలీస్‌లు సమాచారం తెలిసి అక్కడికి వెళ్లగా లోపలివైపు నుంచి గడియ పెట్టి ఉండడంతో తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. నేలపై పడి ఉన్న అతడితోసహా మరికొన్ని వస్తువులు కాలిపోయినట్టు గుర్తించారు. పోస్ట్‌మార్టమ్‌కు మృతదేహాన్ని తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News