న్యూఢిల్లీ: దేశంలో మంకీఫాక్స్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో వ్యక్తికి మంకీఫాక్స్ వైరస్ నిర్ధారణ అయింది. దేశ రాజధానికి చెందిన 34 ఏళ్ల వ్యక్తి మంకీపాక్స్ వైరస్‌కు పాజిటివ్ పరీక్షించినట్లు అధికారిక వర్గాలు ఆదివారం తెలిపాయి. బాధితుడు ఇటీవల విదేశీ ప్రయాణం కూడా చేయలేదని అధికారులు తెలిపారు. భారత్‌లో ఇప్పటివరకు మంకీఫాక్స్ కేసులు నాలుగుకు చేరాయి. ఆ వ్యక్తి ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో జరిగిన ఒక స్టాగ్ పార్టీకి హాజరైనట్లు సమాచారం. పశ్చిమ ఢిల్లీ నివాసి, వ్యక్తి ఈ వ్యాధి లక్షణాలను బయటపడడంతో మూడు రోజుల క్రితం మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరాడు. అతని నమూనాలను శనివారం పూణే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి)కి పంపగా పాజిటివ్‌గా తేలిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కేరళలోనే ఇప్పటివరకు మూడు మంకీఫాక్స్ వ్యాధి కేసులు నమోదైన ముచ్చట తెలిసిందే.
దేశంలో మరో వ్యక్తికి మంకీఫాక్స్ వైరస్
- Advertisement -
- Advertisement -
- Advertisement -