Monday, December 23, 2024

ఎంసిడి స్కూల్ వద్ద తాత్కాలిక జైలుకు అనుమతి నిరాకరించిన ఢిల్లీ మేయర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కంజవాలా లోని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసిడి) స్కూల్ వద్ద తాత్కాలిక కరాగారం ఏర్పాటు చేసుకునేందుకు ఢిల్లీ పోలీసులకు ఆదివారం ఢిల్లీ మేయర్ షెల్లీ ఓబెరాయ్ అనుమతి నిరాకరించారు. మల్లయోధులు(రెజ్లర్లు) పిలుపునిచ్చిన మహిళల మహా పంచాయత్‌కు పెద్ద ఎత్తున హర్యానా నుంచి నిరసనకారులు వస్తారన్న భావనతో ఢిల్లీ పోలీసులు తాత్కాలిక జైలు ఏర్పాటు డిమాండ్ చేశారు.

ఓల్డ్ బావనాలోని కంజవాలా రోడ్డులో ఎంసి ప్రైమరీ గర్ల్ స్కూల్ వద్ద తాత్కాలిక జైలును ఏర్పాటు చేసుకోడానికి ఔటర్ నార్త్ డిస్ట్రిక్ట్ డిసిపి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్‌కు లేఖ రాశారు. దీనికి మేయర్ ఆ డిమాండ్‌ను తిరస్కరిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘అలాంటి అనుమతి ఏది ఇచ్చేది లేదు’ అని ఆమె పేర్కొన్నారు.

కొత్త పార్లమెంటు భవనం ముందు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్లుఎఫ్‌ఐ)అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నిరసనలో భాగంగా ‘మహిళల మహా పంచాయత్’ నిర్వహిస్తామని మల్లయోధులు(రెజ్లర్లు) ప్రకటించారు. బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే ఏడుగురు మహిళా రెజ్లర్లు పోలీసు ఫిర్యాదు దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News