న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసిడి) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయభేరీ మోగించింది. ఈ నెల 4న జరిగిన ఎంసిడి ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా డిఎంసిలోని మొత్తం 250 స్థానాలకు 134 స్థానాలలో ఆప్ విజయవావుటా ఎగరవేసింది. మొదటి నుంచి ఆప్ ఆధ్యికం కనబరుస్తుండగా బిజెపి గడచిన 15 సంవత్సరాలుగా డిఎంసిలో నిరాటంకంగా అధికారంలో ఉన్న బిజెపి ఆప్ చేతిలో ఓటమిని చవిచూసి రెండవ స్థానానికి పరిమితమైంది.
బిజెపి మొత్తం 104 స్థానాలలో గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలలో గెలుపొంది తన ప్రభావాన్ని ఏమాత్రం చాటలేకపోయింది. అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎంఐఎం పార్టీ ఒక స్థానంలో గెలుపొందింది. ఎంసిడిలో మొత్తం 50 స్థానలు ఉండగా మెజారిటీ మార్కు సాధించడానికి 126 స్థానాలు గెలుచుకోవలసి ఉంటుంది. గడచిన 15 సంవత్సరాలుగా బిజెపి కంచుకోటగా ఉన్న ఎంసిడి ఈ ఎన్నికలలో ఆప్ వశమైపోయింది.