- Advertisement -
న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రోరైళ్లలో ఇకపై ఓ వ్యక్తి రెండు వరకూ సీల్ వేసిన మద్యం సీసాలను తీసుకువెళ్లవచ్చు. అయితే రైళ్లలో మద్యం తాగుతూ ప్రయాణించడానికి వీల్లేదు. ఈ మేరకు ఢిల్లీ మెట్రో శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఓ ట్విట్టర్ యుజర్ సందేహాన్ని నివృత్తి చేస్తూ ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ సంస్థ (డిఎంఆర్‌సి) అధికారులు వివరణ ఇచ్చారు. కేవలం ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ లైన్ మినహాయిస్తే
ఢిల్లీలో ఏ ఇతర మెట్రో రైళ్లలో ఆల్కహాల్ తీసుకువెళ్లడం, తాగడం చట్టరీత్యా నేరంగా ఉంది. అయితే పరిస్థితిని సిఐఎస్‌ఎఫ్, డిఎంఆర్‌సితో కూడిన కమిటీ సమీక్షించుకుంది. నిషేధిత సరుకుల జాబితాను ఇప్పుడు సవరించారు. దీని మేరకు ఇకపై అన్ని రూట్లలోనూ రెండు మద్యం బాటిల్స్‌ను మధ్యలో తెరవకుండా ప్రయాణికుడు తీసుకుని వెళ్లవచ్చునని ప్రకటించారు.
- Advertisement -