న్యూఢిల్లీ: హిందూ దేవుళ్లను పూజించేది లేదంటూ ప్రతిన చేసి వివాదానికి కారణమైన ఢిల్లీ ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీలో అక్టోబర్ 5న సుమారు ఏడు వేల మంది బౌద్ధాన్ని స్వీకరిస్తూ ప్రతిజ్ఞ చేస్తున్న సమయంలో తాను కూడా వారితో కలిసి ప్రతిజ్ఞ చేయడంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రధానంగా బిజెపి నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యారు. హిందూ మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్లు ఊపందుకున్నాయి. గుజరాత్‌లో రెండ్రోజుల పర్యటనలో ఉన్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా నిరసన సెగలు తగిలాయి. శనివారం కేజ్రీవాల్ పాల్గొనాల్సిన ర్యాలీకి కొద్దిసేపటికి ముందే ఆయన బ్యానర్లు చించేసి కేజ్రీవాల్ వ్యతిరేక నినాదాలు చేశారు. ఆ నేపథ్యంలో కేజ్రీవాల్ గుజరాత్ పర్యటనలో ఉండగానే మంత్రి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Delhi social welfare minister @AdvRajendraPal, at the centre of an alleged conversion row, resigns@htTweets pic.twitter.com/jlM4XXkljD
— Alok K N Mishra HT (@AlokKNMishra) October 9, 2022