- Advertisement -
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోట్ ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు. తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు పంపించారు. ఇక, మంత్రి పదవికి ఆయన రాజీనామాను ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఆమోదించారు.
ఢిల్లీ ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు పార్టీకి కృతజ్ఞతలు ఢిల్లీ రవాణా మంత్రిగా పనిచేసిన గహ్లోట్ తెలిపారు. యమునా నదిని శుద్ధి చేయడం వంటి కీలక హామీలను నెరవేర్చడంలో పార్టీ వైఫల్యాన్ని ఈ సందర్భంగా ఎత్తి చూపారు. పార్టీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా చేసిన “షీష్‌మహల్” అంశంతో సహా ఇబ్బందికర వివాదాలను కూడా ఆయన ఎత్తిచూపుతు పార్టీపై విమర్శలు చేశారు.
- Advertisement -