న్యూఢిల్లీ: ఈడి దర్యాప్తు చేస్తున్న మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ సోమవారం ఇక్కడి ఎల్ఎన్ జెపి ఆసుపత్రిలో చేరారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. 57 ఏళ్ల జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మే 30న మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఏ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద అరెస్టు చేసింది. “అతన్ని మొదట తీహార్ జైలు నుండి జిబి పంత్ ఆసుపత్రికి తీసుకువచ్చారు, ఆపై ఎల్‌ఎన్‌జెపి హాస్పిటల్ మార్చారు. అతని పరిస్థితి నిలకడగా ఉంది” అని సమాచారం.
కేజ్రీవాల్ ప్రభుత్వంలో పోర్ట్‌ఫోలియో లేని మంత్రి జైన్, హవాలా లావాదేవీల ఆరోపణలపై పిఎంఎల్‌ఏ కింద విచారణను ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్‌లో, విచారణలో భాగంగా జైన్ కుటుంబానికి చెందిన రూ. 4.81 కోట్ల విలువైన ఆస్తులను , అతని యాజమాన్యం,నియంత్రణలో ఉన్న కంపెనీలను ఈడి జప్తు చేసింది.