న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తూ ఆయన, ఆయన కుటుంబ నియంత్రణలో ఉన్న కంపెనీలకు చెందిన రూ. 4.81 కోట్ల ఆస్తులను జప్తు చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం ప్రకటించింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో సత్యేంద్ర జైన్ ఆరోగ్యం, విద్యుత్, హోమ్, పిడబ్లుడి, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, వరదలు, నీటిపారుదల, జల శాఖలకు మంత్రిగా ఉన్నారు. షకుర్ బస్తీ నియోజకవర్గం నుంచి ఆప్ ఎమ్మెల్యేగా ఎన్నికైన జైన్‌ను ఈ కేసుకు సంబంధించి 2018లో ఇడి ప్రశ్నించింది. ఢిల్లీ పరిసరాల్లో జైన్ అక్రమ మార్గాల ద్వారా ఆస్తులు కొనుగోలు చేశారన్నది ఇడి ఆరోపణ. 2017 ఆగస్టులో సిబిఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఇది ఈ కేసు నమోదు చేసింది. కాగా..పంజాబ్ ఎన్నికలకు ముందు జైన్‌ను అరెస్టు చేసేందుకు ఇడి ప్రయత్నిస్తోందంటూ అరవింద్ కేజ్రీవాల్ కొద్ది నెలల క్రితం ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ఆప్‌ను ఇడి టార్గెట్ చేసిందని ఆయన ఆరోపించారు. మార్చిలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగగా మేలో ఆప్‌కు చెందిన ప్రభుత్వం ఏర్పడింది.
ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ఆస్తులు ఇడి జప్తు
- Advertisement -
- Advertisement -
- Advertisement -